ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతదేహం గుర్తింపు

ABN, First Publish Date - 2021-06-22T03:27:30+05:30

మండలంలోని కోనేటిరాజుపాళెం గ్రామ సమీపంలో స్థానికులు సోమవారం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, జూన్‌ 21 : మండలంలోని కోనేటిరాజుపాళెం గ్రామ సమీపంలో స్థానికులు సోమవారం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల కథనం మేరకు గ్రామ సమీపంలో ఉన్న ఓ పాత భవనం వెనుక చెట్ల మధ్య నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఓ వ్యక్తి మృతదేహం ఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నాగరాజు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. 15 రోజుల క్రితం ఆ వ్యక్తి మృతిచెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మొండెం ఓ వైపు, తల మరో వైపు పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో గుర్తించలేని విధంగా ఉంది. సంఘటనా స్థలం వద్ద ఓ మద్యం సీసాను మాత్రమే పోలీసులు గుర్తించారు. ఎవరైనా హత్యచేశారా లేక ఇంకో కారణంతో మరణించాడా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.  పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-22T03:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising