ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎస్‌ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల ధర్నా

ABN, First Publish Date - 2021-07-24T05:20:05+05:30

సీపీఎస్‌ పెన్షన్‌ రద్దు కోరుతూ ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు తహసీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు.

కోవూరులో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవూరు, జూలై 23: సీపీఎస్‌ పెన్షన్‌ రద్దు కోరుతూ ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు తహసీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం ఉపాధ్యాయులు  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  యూటీఎఫ్‌ జిల్లా కమిటీ కార్యదర్శి షేక్‌ ఖాజావలి మాట్లాడుతూ 2018 జులై 1 నుంచి పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. 3,4,5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలపడం తగదన్నారు.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల చిన్నారులు మూడు నుంచి ఐదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుదన్నారు. ఎక్కువ దూరం నడవలేక బాలలు బడికే దూరమయ్యే ప్రమాదముందన్నారు. ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కన్వీనర్‌ మురళీధర్‌రావు, డీటీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ రమణ, యూటీఎఫ్‌ నాయకులు నాగిరెడ్డి, పరంధామయ్య, శ్రీహరి, విశ్వనాఽథ్‌, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు బుజ్జయ్య, బీటీఏ నాయకులు, ఏపీటీఎఫ్‌ నాయకులు తదితరులు మాట్లాడారు. అనంతరం తహసీల్దారు సుబ్బయ్యకు వినతిపత్రం సమర్పించారు. 



Updated Date - 2021-07-24T05:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising