ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నుల భారం జీవోలను భోగిమంటల్లో తగులబెట్టండి

ABN, First Publish Date - 2021-01-13T04:57:28+05:30

ప్రజలపై పన్నుల రూపేణ భారాలు మోపే మున్సిపల్‌ చట్ట సవరణ జీవోలను భోగిమంటల్లో తగులబెట్టాలని నెల్లూరు మాజీ డిప్యూటీ మేయర్‌ మాదాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

కరపత్రాలను విడుదల చేస్తున్న నేతలు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ డిఫ్యూటీ మేయర మాదాల పిలుపు

నెల్లూరు(వైద్యం), జనవరి 12 : ప్రజలపై పన్నుల రూపేణ భారాలు మోపే మున్సిపల్‌ చట్ట సవరణ జీవోలను భోగిమంటల్లో తగులబెట్టాలని నెల్లూరు మాజీ డిప్యూటీ మేయర్‌ మాదాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2500 కోట్ల అప్పుకోసం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ ప్రాంతాలపై రూ.10వేల కోట్ల భారం మోపాలనుకోవటం అవివేకమని విమర్శించారు. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత సమయంలో భారం మోపటం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చట్టసవరణ జీవోలను భోగిమంటల్లో తగుల బెట్టాలన్నారు. అలాగే నిరసన తెలిసేలా పండుగ ముగ్గులు వేయాలని కోరారు. అనంతరం మున్సిపల్‌ చట్టాలకు వ్యతిరేకంగా కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సింహపురి పౌరసమాఖ్య నేతలు శివశంకర్‌, హజరత్తయ్య, శ్రీనివాసులు, కిన్నెర కుమార్‌, కృష్ణయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T04:57:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising