ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చెత్త’ నిర్ణయాలు మానుకోండి

ABN, First Publish Date - 2021-06-22T04:38:48+05:30

చెత్త సేకరణకు యూజర్‌ చార్జీల వసూలు వంటి నిర్ణయాలను ప్రభుత్వం మానుకోవాలని సీపీఐఎంఎల్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆ పార్టీ నాయకుడు కిషోర్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుత విపత్తులో ప్రజలు జీవనాధారం కోల్పోయి సతమతమవుతుంటే పన్నులు పెంచాలనుకోవడం సరికాదన్నారు.

కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న సీపీఐఎంఎల్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్పొరేషన్‌ ఎదుట సీపీఐఎంఎల్‌ ఆందోళన


నెల్లూరు (సిటీ), జూన్‌ 21 : చెత్త సేకరణకు యూజర్‌ చార్జీల వసూలు వంటి నిర్ణయాలను ప్రభుత్వం మానుకోవాలని సీపీఐఎంఎల్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆ పార్టీ నాయకుడు కిషోర్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుత విపత్తులో ప్రజలు జీవనాధారం కోల్పోయి సతమతమవుతుంటే పన్నులు పెంచాలనుకోవడం సరికాదన్నారు. ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించడం ఎక్కడా లేని నిర్ణయమని, చెత్త సేకరణకూ చార్జీలు వసూలు చేస్తే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నించారు. స్వచ్ఛభారత్‌ పేరిట వసూలు చేసిన రూ.కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పన్ను పెంపు, చెత్త చార్జీల జీవోలను రద్దు చేయకపోతే ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యానాదయ్య, కొండమ్మ, రఘు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మేనేజర్‌ రాజేశ్వరికి వినతి పత్రం అందచేశారు. 

Updated Date - 2021-06-22T04:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising