ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌలు గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-06-19T04:54:18+05:30

పొలాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులను తీసుకోవాలని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ తెలిపారు.

కౌలు రైతుల సమావేశంలో అధికారులతో చర్చిస్తున్న నెల్లూరు ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌


విడవలూరు, జూన్‌ 18: పొలాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులను తీసుకోవాలని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ తెలిపారు. మండలంలోని పార్లపల్లిలో శుక్రవారం జరిగిన కౌలు గుర్తింపు కార్డులపై రైతులకు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు గుర్తింపు కార్డులు పొందిన వారికి ప్రభుత్వ రాయితీలు వర్తిస్తాయన్నారు. వ్యవసాయ విత్తనాలు, ఎరువులను రాయితీతో అందజేయడం  జరుగుతుందన్నారు. అంతేకాకుండా రైతు భరోసా పథకం ద్వారా నగదు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు చంద్రశేఖర్‌, వ్యవసాయాధికారి వెంకటకృష్ణయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 


 ఫ్రొటోకాల్‌ పాటించని అధికారులు

 పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినా మొదట సర్పంచ్‌కి సమాచారం ఇవ్వాలి. అయితే పార్లపల్లిలో జరిగిన కౌలు గుర్తింపు కార్డులపై జరిగిన అవగాహన సదస్సులో అధికారులు ఫ్రొటోకాల్‌ను తుంగలో తొక్కారు. గ్రామ సర్పంచ్‌ రామిశెట్టి స్వాతిని ఆహ్వానించాల్సి ఉండగా.. ఆమెకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ విషయమై  జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 

Updated Date - 2021-06-19T04:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising