ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో బోసిబోయిన గూడూరు రైల్వేస్టేషన్‌

ABN, First Publish Date - 2021-05-09T03:55:33+05:30

కొవిడ్‌ కారణంగా ప్రయాణికులు లేక గూడూరు రైల్వేస్టేషన్‌ బోసిబోయింది. చెన్నై, తిరుపతిలకు ఈ స్టేషన్‌మీదే వెళ్లాల్సి ఉండడం, ప్రతి రోజు ఈ స్టేషన్‌ మీదుగా 50కి పైగా రైళ్లు ప్రయాణిస్తుండడంతో, ప్రయాణికులతో ఫ్లాట్‌ఫాంలు రద్దీగా ఉండేవి.

ప్రయాణికులు లేక వెలవెలబోతున్న రైల్వేస్టేషన్‌ ఆవరణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌తో బోసిబోయిన గూడూరు రైల్వేస్టేషన్‌

గూడూరురూరల్‌, మే 8: కొవిడ్‌ కారణంగా ప్రయాణికులు లేక గూడూరు రైల్వేస్టేషన్‌ బోసిబోయింది.  చెన్నై, తిరుపతిలకు ఈ స్టేషన్‌మీదే వెళ్లాల్సి ఉండడం, ప్రతి రోజు ఈ స్టేషన్‌ మీదుగా 50కి పైగా రైళ్లు ప్రయాణిస్తుండడంతో, ప్రయాణికులతో ఫ్లాట్‌ఫాంలు రద్దీగా ఉండేవి. ప్రస్తుతం 20 రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. గూడూరు నుంచి విజయవాడ వెళ్లే విక్రమసింహపురి ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి కరీంనగర్‌ స్పెషల్‌, కాకినాడ-తిరుపతి కాకినాడ స్పెషల్‌, తిరుపతి - విశాఖపట్నం డబుల్‌డెక్కర్‌, బిట్రగుంట-చెన్నై పాసింజర్‌ రైళ్లను కొవిడ్‌ కారణంగా రద్దుచేసినట్లు రైల్వేసిబ్బంది తెలిపారు. దీంతో రైల్వేస్టేషన్‌లో రైళ్లు లేక, ప్రయాణికులు లేక ఫ్లాట్‌ఫాంలు నిర్మానుష్యంగా మారాయి. రిజర్వేషన్‌ చేయించుకున్నవారు, ఫ్లాట్‌ఫాం టిక్కెట్‌ తీసుకున్నవారికి మాత్రమే రైల్వేస్టేషన్‌లోకి అనుమతిస్తున్నారు.



Updated Date - 2021-05-09T03:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising