ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యావసరాల ధరలు నియంత్రించండి

ABN, First Publish Date - 2021-06-15T07:38:24+05:30

నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఆ ధరలను నియంత్రించాలని కోరుతూ దళిత సంఘర్షణ సమితి నాయకులు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న దళిత సంఘర్షణ సమితి నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దళిత సంఘర్షణ సమితి ధర్నా

నెల్లూరు(హరనాథపురం), జూన్‌ 14 : నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఆ ధరలను నియంత్రించాలని కోరుతూ దళిత సంఘర్షణ సమితి నాయకులు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు. సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌ మల్లి మాట్లాడుతూ కొందరు వ్యాపారులు కరోనాను సాకుగా చూపి నిత్యావసర సరుకుల కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీంతో సామా న్యులపై పెనుభారం పడుతోందన్నారు. వంట నూనె, కందిపప్పు, పెసర పప్పు, మినపప్పు ధరలు భారీగా పెరిగాయన్నారు. అధికారులు తనిఖీలు చేయకపోవటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలను పెంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంచిపాక రత్నం, బిళ్ళా మస్తానయ్య, పీ దాసు, దర్శిగుంట రమణయ్య,  పీ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T07:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising