ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రూ అప్‌ చార్జీలు రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-09-19T04:33:33+05:30

విద్యుత్‌ వినియోగదారులపై ప్రభుత్వం మోపుతున్న ట్రూఅప్‌ చార్జీలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ బుచ్చి మండల అధ్యక్షుడు బిట్టా కిశోర్‌ డిమాండ్‌ చేశారు.

వినతిపత్రం సమర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబరు18: విద్యుత్‌ వినియోగదారులపై ప్రభుత్వం మోపుతున్న ట్రూఅప్‌ చార్జీలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ బుచ్చి మండల అధ్యక్షుడు బిట్టా కిశోర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం బుచ్చిలోని విద్యుత్‌ ఏడీ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో ప్రజలు జీవనోపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న నేపథ్యంలో విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపడం దారుణమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పచ్చామధుసూధన్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు కే. మహేష్‌, మైనారిటీ నాయకుడు ఎస్‌కే సర్దార్‌, టౌన్‌ అధ్యక్షుడు షాకీర్‌, చాన్‌భాషా, వెంకటేష్‌, అహ్మద్‌, సాయి పాల్గొన్నారు.

ప్రజలపై రూ. 3060 కోట్ల భారం

బుచ్చిరెడ్డిపాళెం ట్రూ అప్‌ చార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం  17లక్షల మంది వినియోగదారులపై రూ.3060 కోట్ల భారం మోపిందని నమామి గంగే రాష్ట్ర నాయకుడు మిడతల రమేష్‌ అన్నారు. శనివారం ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రెండోరోజు బుచ్చిరెడ్డిపాళెంలోని ఆర్‌బీఆర్‌ సప్లయర్స్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. అనంతరం బుచ్చిలోని అన్ని రేషన్‌షాపుకు వెళ్లారు. కొవిడ్‌ నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు  చెప్పుకుంటోందని వివరించారు. కార్యక్రమంలో రామిశెట్టి మోహన్‌బాబు,  కాసా శ్రీనివాసులు,  నరసింహులు, నాగేశ్వరరావు, తేజ, కనిసిరి శీనయ్య, సుబ్బారావు, జడపల్లి రమణమ్మ  పాల్గొన్నారు.


Updated Date - 2021-09-19T04:33:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising