ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరలు పెంచి దోపిడీ

ABN, First Publish Date - 2021-06-19T04:59:47+05:30

పెట్రోలు, డీజిల్‌, నిత్యావసరాల ధరలను పెంచి ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, సీపీఎం నగర కార్యదర్శి మూలం రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెంపును నిరసిస్తూ వామపక్షాలు ఐక్యంగా శుక్రవారం గాంధీబొమ్మ వద్ద నిరసన తెలిపాయి.

నిరసన తెలుపుతున్న వామపక్షాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం, సీపీఐ నిరసన

నెల్లూరు(వైద్యం/రూరల్‌), జూన్‌ 18 : పెట్రోలు, డీజిల్‌, నిత్యావసరాల ధరలను పెంచి ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, సీపీఎం నగర కార్యదర్శి మూలం రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెంపును నిరసిస్తూ వామపక్షాలు ఐక్యంగా శుక్రవారం గాంధీబొమ్మ వద్ద నిరసన తెలిపాయి. నాయకులు మాట్లాడుతూ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అసలే కరోనాతో అల్లాడుతున్న ప్రజలపై ఇలా భారం మోపటం సరికాదన్నారు. నిరుద్యోగిత పెరిగి ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లుతోందని, ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబానికి నెలకు రూ.7500 ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కేరళ తరహాలో అన్ని రకాల నిత్యావసరాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలపై ఈ నెల 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు శ్రీరాములు, చిన్న అంకయ్య, నాగేంద్ర, సీఐటీయూ నగర కార్యదర్శి నాగేశ్వర రావు, ఏఐవైఎఫ్‌, డీవైఎఫ్‌ఐ నాయకులు సిరాజ్‌, ఆదినారాయణ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదే అంశంపై నెల్లూరు రూరల్‌ మండలంలోని పొట్టేపాళెం సచివాలయం ఎదుట సీపీఎం శ్రేణులు ఆందోళన చేపట్టాయి. నాయకులు చంద్రమౌళి, ఆలూరు తిరుపాలు, రమణయ్య, ముత్యాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T04:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising