ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరును ప్రఽథమస్థానంలో నిలపాలి

ABN, First Publish Date - 2021-03-07T04:42:46+05:30

నగరంలో సమగ్ర పారిశుధ్యం సేవలు అందించి దేశస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ కోరారు.

విద్యార్థులకు మెమోంటోలు అందజేస్తున్న కమిషనర్‌ దినేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్‌ఎంసీ కమిషనర్‌ దినేష్‌కుమార్‌

నెల్లూరు(సాంస్కృతికం), మార్చి 6: నగరంలో సమగ్ర పారిశుధ్యం సేవలు అందించి దేశస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ కోరారు. శ్రీ వెంకటేశ్వర కస్తూర్భా కళాక్షేత్రంలో శనివారం జరిగిన మన నెల్లూరు - మన బాధ్యత ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సచివాలయ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది శిక్షణలో తెలుసుకున్న విషయాలపై ప్రజలను చైతన్య వంతులను చేయాలని పిలుపునిచ్చారు. ఇంటి నుంచి చెత్త బయటకు రాకుండా ప్రజలకు నేర్పించాలని కోరారు. ప్రతి ఇంట్లో పొడి, తడిచెత్త ప్రమాదకరమైన చెత్తని వేరుచేసే విధానాలు అవగాహన కల్పించాలన్నారు. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులు చెత్తను శుద్ధి చేయడం, ఉపయోగించడం ఎలా అనే విధానాలను సాధారణ స్థాయి నుంచి సాంకేతిక స్థాయి వరకు తమ ప్రయోగాల ద్వారా వివరించి అందర్ని ఆకర్షించారు. నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ తరగతుల్లో జీసీఐ జేఎన్‌టీయూకే కాకినాడ సివిల్‌ ఇంజనీరింగ్‌ డైరెక్టరు కేవీఎస్‌జీ మురళీకృష్ణ పారిశుధ్యం - పర్యావరణం గురించి చక్కగా వివరించారు. చెత్తపై వివిధ రూపకాలు, సందే శాత్మక గీతాలతో విద్యార్థులు అలరించారు. చివరగా విద్యార్థులకు మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందించి  అభినందించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, పాఠశాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising