ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్‌గారూ.. కాపాడండి!

ABN, First Publish Date - 2021-10-20T04:54:05+05:30

వందేళ్ల పైబడిన గాంధీ ఆ శ్రమ భూములు దిక్కు లేకుండా పోతున్నాయి.

కోతకు గురవుతున్న గాంధీ ఆశ్రమ భూములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్నానది కోతకు గురవుతున్న ‘గాంధీ’ భూములు 


ఇందుకూరుపేట, అక్టోబరు 19 : వందేళ్ల పైబడిన గాంధీ ఆ శ్రమ భూములు దిక్కు లేకుండా పోతున్నాయి. సబర్మతీ తర్వాత స్వాతంత్య్ర ఉద్యమానికి ఊతంగా నిలిచిన జిల్లాలోని పల్లెపాడు పినాకిని ఆశ్రమ భూములు పెన్నానదిలో కలిసిపోతున్నాయి. ఇప్ప టికే దాదాపు 4.5 ఎకరాలు పెన్నానది ఉధృతికి కరిగిపోతూ వస్తు న్నాయి. గత మూడేళ్లగా వరుసగా పెన్నానదికి బలమైన సోమశిల నీటి తాకిడి వలన తెలియకుండానే నిశ్శబ్ధంగా ఆశ్రమ భూములు వరద తాకిడికి గురవుతున్నాయి. ఎంతో విలువైన ఆశ్రమ భూము లను కాపాడాలని ముఖ్యంగా పెన్నానది వలన కోతకు గురికా కుండా రివిట్‌మెంట్‌ వేయించాలనే నాయకుల ప్రతిపాదనలు వేదిక మీద నుంచి దిగిరావడం లేదు. గాంధీ ఆశ్రమాన్ని ముఖ్యమంత్రి, గవర్నర్లు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు కూడా సందర్శించారు. కాగా గాంధీజీ స్వయంగా పల్లెపాడు విచ్చేసి ఆశ్రమాన్ని ప్రారంభించి ఈ నేలను పుణ్యభూమిగా మలచిన గొప్ప అనుభూతి కూడా ఎవరికీ ప్రేరణ ఇవ్వలేదు. ఎంతోమంది దేశ భక్తులను తీర్చిదిద్ది, మరెన్నో ఉద్యమాలకు వేదికగా నిలిచిన ఈ ఆశ్రమ భూములను కలెక్టర్‌ అయినా కాపాడాలని, రివెట్‌మెంట్లు వేయించి శాశ్వతంగా నిలిపే బాధ్యత తీసుకోవాలని జిల్లా చరిత్ర అభిమానులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-20T04:54:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising