ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలు

ABN, First Publish Date - 2021-04-17T03:47:31+05:30

కావలి పట్టణం ముసునూరులో జరిగిన రాష్ట్రస్థాయి కావలి క్రికెట్‌ చాంపియన్‌ పోటీలు శుక్రవారం ముగిశాయి.

విజేత జట్టుకు రూ.70 వేల చెక్కు, కప్‌ అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్లిపాడు ఆర్‌ఆర్‌ లెవెన్స్‌ జట్టు విజేత

రన్నర్‌గా పీజీఎం అల్లూరు లెవెన్స్‌ 

కావలిటౌన్‌, ఏప్రిల్‌ 16: కావలి పట్టణం ముసునూరులో జరిగిన రాష్ట్రస్థాయి కావలి క్రికెట్‌ చాంపియన్‌ పోటీలు శుక్రవారం ముగిశాయి. పల్లిపాడుకు చెందిన ఆర్‌ఆర్‌ లెవెన్స్‌, అల్లూరుకు చెందిన పీజీఎం లెవెన్స్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్‌లో ఆర్‌ఆర్‌ లెవెన్స్‌ జట్టు విజేతగా నిలవగా పీజీఎం లెవెన్స్‌ రన్నర్‌గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్‌ఆర్‌ లెవెన్స్‌ జట్టు 167 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్‌ చేసిన పీజీఎం లెవెన్స్‌ 57 పరుగులకే అలౌట్‌ అయింది. మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌గా జస్సీ, బెస్ట్‌ బౌలర్‌గా గురు బహుమతులు అందుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌ రెడ్డి పాల్గొని తన దాతృత్వంతో విన్నర్‌ జట్టుకు రూ.70,000, రన్నర్‌ జట్టుకు రూ.50,000 బహుమతులు, కప్‌లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందిస్తాయన్నారు. క్రీడాకారుల్లో ఆత్మస్థైర్యం మెండుగా ఉంటుందని, అందుకే అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు.  కార్యక్మమంలో అంకమరావు, ఆర్‌ సుధాకర్‌, జ్యోతిబాబురావు, పద్మనాఽభరెడ్డి, సన్నిగంటి భాస్కర్‌, సీహెచ్‌ మాల్యాద్రి, బాబి, ఆర్గనైజర్స్‌ ఎం శ్రీను, ముఖేష్‌, బాలకృష్ణ, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-17T03:47:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising