ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేనేత కార్మికులంతా ఏకం కావాలి

ABN, First Publish Date - 2021-10-18T03:55:10+05:30

చేనేత కార్మికులంతా ఏకమై హక్కులను కాపాడుకో వాలని జాతీయ చేనేత ఐక్యవేదిక జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున, నీలూరి రిషింగప్ప పిలుపునిచ్చారు.

జాతీయ, రాష్ట్ర అధ్యక్షులను సన్మానిస్తున్న చేనేత ఐక్యవేదిక నాయకుల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జాతీయ చేనేత ఐక్యవేదిక జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు

పొదలకూరు, అక్టోబరు 17 : చేనేత కార్మికులంతా ఏకమై హక్కులను కాపాడుకో వాలని జాతీయ చేనేత ఐక్యవేదిక జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున, నీలూరి రిషింగప్ప పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక బీసీ భవన్‌ (జ్యోతిరావుఫూలే భవన్‌)లో  జాతీయ చేనేత ఐక్యవేదిక జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఆఫ్కో స్థలంలో చేనేత భవనాలు నిర్మించి చేనేత కార్మికుల కోసం వినియోగించాలన్నారు. నేతన్న నేస్తం ద్వారా రూ.24వేలు జమ కాని వారికి ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేయాలన్నారు. ప్రభుత్వం ఆఫ్కో వస్త్రాలనే కొనుగోలు చేయాలని, చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. చేనేత  కార్మికులకు వలంటరీ వ్యవస్థ ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. చేనేత  పట్టు రాయితీ పాసు పుస్తకాల పథకం పునరుద్ధరణ చేయాలన్నారు. అనంతరం వారిద్దరిని నేతలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కోనం బ్రహ్మయ్య, జాతీయ కార్యవర్గ సభ్యులు చింతగింజల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఊకోటి లక్ష్మీనారాయణ, జిల్లా కన్వీనర్‌ పూజల లక్ష్మీనారాయణ, చిత్తూరు జిల్లా కన్వీనర్‌ వెంకటరమణ, సర్వేపల్లి కన్వీనర్‌ పముజుల శంకరయ్య, మండల అధ్యక్షులు సోమా భాస్కర్‌, కార్యదర్శి చొప్పా వెంకటేశ్శర్లు, మహిళలు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T03:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising