ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహార భద్రత చట్టం అమలవుతోందా?

ABN, First Publish Date - 2021-07-28T05:27:55+05:30

జాతీయ ఆహార భద్రత చట్టం - 2013 జిల్లాలో అమలు జరుగుతున్న తీరును తెలుసుకునేందుకు మంగళవారం జీఎన్‌ శర్మ నాయకత్వంలోని కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ఆ బృందం రేషన్‌ షాపులకు వెళ్లి కార్డుదారులతో మాట్లాడారు. సరకుల పంపిణీ మొదలు, నాణ్యత ప్రమాణాల వరకు పలు అంశాలపై ఆరా తీశారు.

రేషన్‌ షాపులో కార్డుదారులతో మాట్లాడుతున్న కేంద్ర బృందం సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర బృందం తనిఖీ

నెల్లూరు(హరనాథపురం), జూలై 27 : జాతీయ ఆహార భద్రత చట్టం - 2013  జిల్లాలో అమలు జరుగుతున్న తీరును తెలుసుకునేందుకు మంగళవారం జీఎన్‌ శర్మ నాయకత్వంలోని కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ఆ బృందం రేషన్‌ షాపులకు వెళ్లి కార్డుదారులతో మాట్లాడారు. సరకుల పంపిణీ మొదలు, నాణ్యత ప్రమాణాల వరకు పలు అంశాలపై ఆరా తీశారు. నెల్లూరులోని ఎన్టీఆర్‌ నగర్‌లో ఉన్న రేషన్‌ షాపులను, పెద్దచెరుకూరులో ఉన్న రేషన్‌ షాపును తనిఖీ చేశారు. బుధవారం కోవూరు, కొడవలూరు, ఇందుకూరుపేటలోని చౌకదుకాణాలను తనిఖీ చేయనున్నారు. ఈ బృందంలో ఎం నిర్మల్‌ చితోరా, ఎంఎల్‌ చింపా తదితరులు ఉండగా జిల్లా పౌరసరఫరాల అధికారి సుఽధాకర్‌ వారిని రేషన్‌ షాపులకు తీసుకెళ్లారు.

కార్డుదారులకు ఇబ్బంది రానివ్వొద్దు

రేషన్‌ కార్డుదారులకు ఇబ్బంది లేకుండా  నిత్యావసర సరకులను అందచేయాలని కేంద్ర బృందం జిల్లా అధికారులను ఆదేశించింది. తిక్కన భవన్‌లో మంగళవారం ఆ బృందం సభ్యులు అధికారులతో సమావేశమయ్యారు. శర్మ మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో రేషన్‌ షాపులను తనిఖీ చేశామని, కార్డుదారులకు ఏలాంటి సమస్యలు లేకుండా సకాలంలో సరకులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలోని 1896 రేషన్‌ షాపుల ద్వారా 8.92 లక్షల మంది కార్డుదారులకు సరుకులను సక్రమంగా పంపిణీ చేయిస్తున్నామని చెప్పారు. 

Updated Date - 2021-07-28T05:27:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising