ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్షలు రద్దు చేయండి

ABN, First Publish Date - 2021-04-24T05:05:07+05:30

కరోనా రెండవ దశ తీవ్రంగా ఉన్నందున పది, ఇంటర్‌తోపాటు బీటెక్‌, పాలిటెక్నిక పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు.

నిరసన తెలుపుతున్న విద్యార్థి జేఏసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థి సంఘాల డిమాండ్‌


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), ఏప్రిల్‌ 23:

కరోనా రెండవ దశ తీవ్రంగా ఉన్నందున పది, ఇంటర్‌తోపాటు బీటెక్‌, పాలిటెక్నిక పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు.

ఏపీ విద్యార్థి జేఏసీ నాయకులు వీఆర్సీ వద్ద ధర్నా చేశారు. జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాయి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్‌, దినేష్‌, పవన్‌, సాయి, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆర్‌ఐవో మాల్యాద్రి చౌదరికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పీ శ్రీనివాసులు,  సనత్‌, అఖిల్‌, నాగూర్‌, హర్ష తదితరులు పాల్గొన్నారు. 

పరీక్షలను రద్దు చేయాలంటూ భగత్‌సింగ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకులు కూడా ఆర్‌ఐవోకు వినతి పత్రం అందించారు. మల్లి శ్రీకాంత్‌ యాదవ్‌, చెరుకూరి హేమంత్‌ రాయల్‌, నాసిర్‌, హరీష్‌, పవన్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి సంఘ కార్యదర్శి వీవీఎస్‌ చైతన్య ఆ సంఘ కార్యాలయంలో మాట్లాడుతూ వెంటనే పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సొలోమాన్‌, రాఖీ, పవన్‌, నాని, సాయి, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-24T05:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising