ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మలమ్మ కరుణించేనా ?

ABN, First Publish Date - 2021-02-01T05:41:25+05:30

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు కేంద్ర బడ్జెట్‌

నిధుల కోసం సెంట్రల్‌ ప్రాజెక్టుల ఎదురుచూపు

వరాల కోసం వేతన జీవుల ఆశలు


నెల్లూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఓ వైపు నిధుల కోసం కేంద్ర ప్రాజెక్టులు ఎదురుచూస్తుండగా, కరోనా కష్టకాలం నుంచి కోలుకునేందుకు వేతన జీవులు వరాల కోసం ఎదురుచూస్తున్నారు. 

జిల్లాకు తలమానికంగా మారుతాయని భావించిన పలు కేంద్ర పథకాలు ఏళ్లు గడుస్తున్నా శంకుస్థాపన దశ దాటడం లేదు. ఈ పథకాలకు కొన్నేళ్ల నుంచి నిధుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నప్పటికీ చివరకు నిరాశే మిగులుతోంది. మరి ఈ ఏడాదైనా ఈ ప్రాజెక్టుల్లో కదలిక ఉంటుందో లేదో చూడా లి. 2016 డిసెంబరులో వెంకటాచలం మండలం చౌటపాలెం వద్ద జాతీయ విద్య, పరిశోధన సంస్థ(ఎన్‌సీఈఆర్‌టీ)కు అప్పటి కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్యనాయుడు, ప్రకాష్‌ జవడేకర్‌లు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అండమాన్‌ నికోబర్‌ దీవులు రాష్టా్ట్రలకు ఈ ఎన్‌సీఈఆర్‌టీ సేవలందించనుంది. 2018 నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టేలా తొలుత ప్రణాళికలు రచించుకున్నప్పటికీ ఐదేళ్లు గడిచినా నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద 2015లో శంకుస్థాపన చేసిన సముద్ర జలాల పరిశోధన సంస్థ(ఎన్‌ఐవోటీ) ఇంకా నిర్మాణ దశలోనే కొనసాగుతోంది. నిధులు నామమాత్రంగా కేటాయిస్తుండడం తో ఈ పరిస్థితి దాపురించిందని నిపుణులు చెబుతున్నారు. కామధేను ప్రాజెక్టుకు కూడా ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోతుండడంతో అభివృద్ధి సాధ్యం కావడం లేదు. ఇక ఓడరేవులు, పారిశ్రామిక వాడలను కలుపుతూ సముద్ర తీరం వెంబడి నాలుగు లైన్ల రహదారులను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. జిల్లాలో సుమారు రూ.2 వేల కోట్లతో రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు కూడా తయారయ్యాయి. ఇప్పటికి సర్వేమాత్రమే పూర్తి కాగా, నిధులు లేకపోవడంతో పనులు మొదలు కాలేదు. అలానే చెన్నై-బెంగుళూరు, చెన్నై - విశాఖపట్నం ఇండస్ట్రియల్‌ కారిడార్ల పనులు కూడా ఆశించిన  స్థాయిలో జరగడం లేదు. అలాగే పలు రైల్వే లైన్ల అభివృద్ధి, నెల్లూరు రైల్వే స్టేషన్‌ అభివృద్ధి కేంద్ర పెద్దల మాటలకే పరిమితమైంది. ఈ ఏడాది బడ్జెట్‌లోనైనా ఈ ప్రాజెక్టుల పురోగతికి నిధులు కేటాయించాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. అదే సమయంలో కరోనా దెబ్బకు వేతన జీవులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కోలుకోలేని దెబ్బతిన్నారు. వీరంతా తిరిగి కోలుకునేందుకు కేంద్ర బడ్జెట్‌లో నిర్మలమ్మ ఎటువంటి వరాలు ప్రకటిస్తారా..? అని కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. 

Updated Date - 2021-02-01T05:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising