ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేత అరాచకాలకు పోలీసుల సహకారం

ABN, First Publish Date - 2021-10-19T03:32:19+05:30

బోగోలు మండల వైసీపీ కన్వీనర్‌ వీరరఘు అరాచకాలకు పాల్పడుతుండగా వాటిని నివారించాల్సిన పోలీసులు ఆయనకు సహకరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ నేతల ఆరోపణ

కావలి, అక్టోబరు 18: బోగోలు మండల వైసీపీ కన్వీనర్‌ వీరరఘు అరాచకాలకు పాల్పడుతుండగా వాటిని నివారించాల్సిన పోలీసులు ఆయనకు సహకరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. కావలి జర్నలి్‌స్టక్లబ్‌లో సోమవారం బాధిత మహిళ, బీజేపీ మండల మహిళా ప్రధాన కార్యదర్శి చేబ్రోలు పద్మలత, మండల కన్వీనర్‌ పసుపులేటి వెంకటేశ్వర్లులు వైసీపీ నేత వీరరఘు అరాచకాలపై ధ్వజమెత్తారు. పద్మలత మాట్లాడుతూ బోగోలులో తనకు సంబంధించిన రెండెకరాల పొలాన్ని వీరరఘు ఆక్రమించుకుని రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి తనను వేధిస్తున్నాడని వాపోయింది. తనపై తన బంధువులతో దాడి చేయించి పత్రికల్లో రాయలేని భాషలతో తిట్టించారన్నారు. తనను ఎక్కడ కనిపించినా మహిళని కూడా చూడకుండా అసభ్యకరంగా దుర్భాషలాడుతున్నారని ఆమె కన్నీటి పర్వంతమైంది. కేసు పెట్టడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లితే పోలీసుల సమక్షంలోనే బెదిరించాడన్నారు. బీజేపీ మండల కన్వీనర్‌ పసుపులేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైసీపీ నేత వీరరఘు అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి ఇలాంటి నేతలను ప్రోత్సహించకుండా మండల ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకుని వారికి న్యాయం జరిగేట్లు చూడాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మహిళా నేతలు అరుణకుమారి, శిరీష తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-19T03:32:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising