ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపండి

ABN, First Publish Date - 2021-03-09T05:45:20+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సోమవారం నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంకు ఉద్యోగుల ర్యాలీ

నెల్లూరు(హరనాథపురం), మార్చి 8 : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సోమవారం నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఏపీ ప్రధాన కార్యదర్శి వీ ఉదయకుమార్‌ ఆధ్వర్యంలో దర్గామిట్ట నుంచి మాగుంట విగ్రహం వరకు ఈ నిరసన ప్రదర్శన సాగింది. ఉదయకుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించటం వల్ల అనేక గ్రామీణప్రాంత శాఖలను మూసివేయవలసి వస్తుందన్నారు. దీంతో సామాన్య ఖాతాదారులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీ అనంతరం నాయకులు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో మృదుల, సుమన్‌, బాషా, కిరణ్‌, రామకృష్ణ, ఆనందరాంసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-09T05:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising