ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల ఆర్థిక భరోసాకే ఆసరా : ఎమ్మెల్యే కిలివేటి

ABN, First Publish Date - 2021-10-18T03:25:10+05:30

రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలివేటి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, అక్టోబరు 17 : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ఆదివారం స్థానిక కల్యాణ మండపంలో ఆసరా రెం డో విడత సంబరాలు జరిగాయి. ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మె ల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నా మన్నారు. వారి ఆర్థిక బలోపేతానికి ఎంతో సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌, ఎంపీపీ అనిల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి, వైసీపీ నాయకులు కళత్తూరు శేఖర్‌రెడ్డి, తిరుపాల్‌, అయితా శ్రీధర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు పోలూరు పద్మ,  మీజూరు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సైదాపురం: స్థానిక జడ్పీ క్రీడా మైదానంలో వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత పంపిణీ  కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.1.27 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించిన జడ్పీ హైస్కూల్‌ అదనపు తరగతుల భవనాలను ఎమ్మెల్యే ఆనం రామనారాణరెడ్డి ప్రారంభించారు.  ఊటుకూరులో రూ.33 లక్షల నిధులతో నిర్మించిన రక్షిత మంచి నీటి సరఫరా పథకం, నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌ రూ.25 లక్షల నిధులతో నిర్మించిన గ్రామీణ పశు వైద్యశాల భవనాన్ని ఎమ్మెల్యే ఆనం, ఎంపీ గురుమూర్తి ప్రారంభించి మొక్కలు నాటారు. కలిచేడులో మైకా మైన్‌ కార్మిక సంక్షేమ సంస్థ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక  పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి సహకారంతో  కేంద్ర ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని తిరుపతి ఎంపీ గురుమూర్తి హామీ ఇచ్చారు.  డీఆర్‌డీఏ సాంబశివారెడ్డి, ఏపీఎం రాధ, మండల అధికారులు, సిబ్బంది, రాపూరు ఏఎంసీ చైర్మన్‌ నోటి రమణారెడ్డి, ఎంపీపీ పెంచలమ్మ, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T03:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising