ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం : ఏపీటీఎఫ్‌

ABN, First Publish Date - 2021-04-20T03:45:14+05:30

ఉపాధ్యాయ సమస్యలపై దశలవారీగా పోరాటాలు నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ చేవూరు సుబ్బారావు తెలిపారు

వినతిపత్రాన్ని అందచేస్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, ఏప్రిల్‌ 19 : ఉపాధ్యాయ సమస్యలపై  దశలవారీగా పోరాటాలు నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ చేవూరు సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం వెంకటాచలం తహసీల్దారుకు వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. పీఆర్సీ నివేదికను వెల్లడించి 2018 నుంచి అమలు చేయాలని, ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. 20వేలకుపైగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో  ఏపీటీఎఫ్‌ మండలాధ్యక్షుడు డి.శ్రీనివాసులురెడ్డి, ప్రధాన కార్యదర్శి జె.నరసింహయ్య, చెన్నయ్య, సుబహాన్‌, సర్థార్‌, రవీంద్ర, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


టీపీ గూడూరులో...


తోటపల్లిగూడూరు, ఏప్రిల్‌ 19 : టీచర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు  సోమవారం తహసిల్దారుకు వినతిపత్రం అందచేశారు. వారు మాట్లాడుతూ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి హజరత్‌, మండల గౌరవ అధ్యక్షుడు తోట శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు ఐ.బాలకృష్ణ, మండల కార్యనిర్వహ క కార్యదర్శి శ్రీధర్‌బాబు, కార్యదర్శులు కృష్ణయ్య, నారాయణ, శ్రీదేవి , అరుణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. 


---------

Updated Date - 2021-04-20T03:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising