ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజువారి పారిశుధ్య కార్మికులకు రూ.12 వేలు వేతనం ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-07-27T03:22:12+05:30

రోజువారి పారిశుధ్య కార్మికులకు రూ.12 వేల జీతం ఇవ్వాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.ఆనందరావు, టీ.మాలకొండయ్య పేర్కొన్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న కార్మిక సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, జూలై 26: రోజువారి పారిశుధ్య కార్మికులకు రూ.12 వేల జీతం ఇవ్వాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.ఆనందరావు, టీ.మాలకొండయ్య పేర్కొన్నారు. ఆ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ బీ.శివారెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. కావలి మున్సిపాలిటీలో డైలీ పారిశుధ్య కార్మికులుగా 100 మంది మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వీరికి పనికి తగిన జీతాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు. ఏళ్లతరబడి పనిచేస్తున్న స్కూల్‌ స్వీపర్స్‌కు రూ. 4వేలు ఇస్తున్నారని వారికి కూడా రూ.12 వేలు ఇవ్వాలన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను 60 సంవత్సరాల పేరుతో తొలగిస్తున్నవారి పిల్లలను అవుట్‌ సోర్సింగ్‌లో నియమించాల్సి ఉన్నా అలా చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. వీటిపై స్పందించి న్యాయం చేయకపోతే దశలవారీగా ఆందోళన చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎస్‌కే బాబు, తురక శీనయ్య, శివకోటయ్య, పీ. అనిత, బీ. మాలకొండయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T03:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising