ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంజనేయపురం వద్ద హైడ్రామా

ABN, First Publish Date - 2021-06-19T04:56:21+05:30

గ్రామస్థుల అనుభవంలో ఉన్న భూమిని గ్రామస్థులకే విడిచి పెట్టాలంటూ సాక్షాత్తు ఎమ్మెల్యే కాకాణి ఆదేశిస్తున్నా.. అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు.

అధికారుల తీరును నిరసిస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆందోళనకు దిగిన గ్రామస్థులు 


తోటపల్లిగూడూరు, జూన్‌ 18 : గ్రామస్థుల అనుభవంలో ఉన్న భూమిని గ్రామస్థులకే విడిచి పెట్టాలంటూ సాక్షాత్తు ఎమ్మెల్యే కాకాణి ఆదేశిస్తున్నా.. అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం ఈ హైడ్రామా  మండలంలోని చింతోపు పంచాయతీ మజరా ఆంజనేయపురం వద్ద జరుగుతోంది. శుక్రవారం అధికారులు గ్రామస్థుల కోసం విడిచిపెట్టిన భూమిలోనే ఇళ్ల స్థలాలు సిద్ధం చేస్తుండడంతో గ్రామస్థులు విస్తుపోయారు. అధికారుల తీరును వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి అంగీకరించినా, అధికారులకు ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ అనుభవంలో ఉన్న  భూమిని విడిచిపెట్టేది లేదని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. తహసీల్దారు రమాదేవి  మాట్లాడుతూ ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్థుల అనుభవంలో ఉన్న భూమిని విడిచిపెట్టినట్టు తెలిపారు.  

Updated Date - 2021-06-19T04:56:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising