ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరూ ఉన్నా ఒంటరి!

ABN, First Publish Date - 2021-12-12T02:43:24+05:30

పక్షవాతంతో కాలూచేయీ పనియచేయకపోవడం, కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోకపోవడంతో కండలేరు ముంపు గ్రామమైన గుండవోలులో బొమ్మిరెడ్డి భాస్కరరెడ్డి (50) పక్షం రోజులుగా బతుకుపోరాటం చేస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

మంచానికే పరిమితమైన భాస్కరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అనారోగ్యంతో మంచంమీదే వెతలు

తిండి, నీళ్లు లేక ఆగచాట్లు

 గుండవోలులో ఒంటరి నిర్వాసితుడి అగచాట్లు

రాపూరు, డిసెంబరు 11: పక్షవాతంతో కాలూచేయీ పనియచేయకపోవడం, కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోకపోవడంతో కండలేరు ముంపు గ్రామమైన గుండవోలులో బొమ్మిరెడ్డి భాస్కరరెడ్డి (50) పక్షం రోజులుగా బతుకుపోరాటం చేస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతంగా జీవించిన ఆయన నేడు ఆకలితో అలమటిస్తున్నట్లు  వాపోతున్నారు.  భాస్కరరెడ్డి వివాహం చేసుకోలేదు. తల్లిదండ్రులు  మరణించడంతో తోబుట్టువు చూసుకునేది. ప్రభుత్వం ఇచ్చిన్న ముంపు పరిహారం సైతం   తీసేసుకున్న బంధువులు ప్రస్తుతం పట్టించుకోకపోవడంతో 15 రోజులుగా మంచంమీదే ఉన్నాడని, దీంతో దుర్గంధం వెలువడుతోందని అంటున్నారు.  ఒకట్రెండు రోజులు పట్టించుకోకుంటే పరిస్థితి తీవ్రమవుతుందని, అధికారులో, పాలకులో ఎవరో ఒకరు స్పందించి బాధితుడిని ఆసుపత్రికి చేర్చాలని కోరుతున్నారు. ఈ విషయమై వైసీపీ నాయకుడు గంగోటి ఆనంద్‌ మాట్లాడుతూ తమతో కలసి తిరిగిన వ్యక్తి పరిస్థితి ఇలా మారడం తాము చూడలేక పోతున్నామన్నారు. బంధువులకు ఫోన్‌ చేసినా స్పందించడం లేదన్నారు.  అధికారులు స్పందించి ఆసుపత్రికి చేర్చి ఆదుకోవాలని గ్రామస్థులు ముక్తకంఠంతో కోరుతున్నారని వివరించారు. 


Updated Date - 2021-12-12T02:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising