ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి కుటుంబానికి ఆనందయ్య మందు!

ABN, First Publish Date - 2021-07-11T03:33:27+05:30

వెంకటగిరి నియోజకవర్గంలోని అన్నీ కుటుంబాలకు ఇళ్ల వద్దే ఆనందయ్య మందు అందిస్తామని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు.

గిరి ప్రదక్షిణ చేస్తున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, జూలై 10: వెంకటగిరి నియోజకవర్గంలోని అన్నీ కుటుంబాలకు ఇళ్ల వద్దే ఆనందయ్య మందు అందిస్తామని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. పెంచలకోన క్షేత్రంలో శనివారం ఆయనజన్మదిన వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అనుచరులతో కలసి కరోనా మందు డబ్బాలతో శ్రీవారి ఆలయ గిరి ప్రదక్షిణలు చేశారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీవార్లను దర్శించుకున్న అనంతరం రాపూరు మండలంలోని నాయకులకు మందు డబ్బాలను అందించారు. ప్రతీ ఇంటికీ మందు పంపిణీ చేయాలని కోరారు.  ఎన్‌డీసీసీ బ్యాంకు డైరెక్టరు చెన్ను బాలకృష్ణారెడ్డి, ఆనం తనయ కైవల్య,  వైసీపీ నాయకులు ఆనం రంగమయూరరెడ్డి, కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి, శ్రీకిరెడ్డి శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-11T03:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising