ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూడూరు అభివృద్ధికే డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌!

ABN, First Publish Date - 2021-02-25T04:11:15+05:30

గూడూరు అభివృద్ధి సంక్షేమం కోసం గ్రేటర్‌ గూడూరు డెవలెప్‌మెంట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశామని కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ట్రస్టీ కనుమూరు హరిచంద్రారెడ్డి అన్నారు

మాట్లాడుతున్న కనుమూరు హరిచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, ఫిబ్రవరి 24: గూడూరు అభివృద్ధి సంక్షేమం కోసం గ్రేటర్‌ గూడూరు డెవలెప్‌మెంట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశామని కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ట్రస్టీ కనుమూరు హరిచంద్రారెడ్డి అన్నారు. స్థానిక రోటరీభవన్‌లో గ్రేటర్‌గూడూరు డెవలప్‌మెుంట్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రాత్మకంగా గుర్తింపు పొందిన గూడూరులో కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు ఒంటెద్దు పోకడలు పోవడం హేయమైన చర్య అన్నారు.  గూడూరుకు ఐకాన్‌గా ఉన్న టవర్‌క్లాక్‌కు, బాటసారు లకోసం పుల్లమ్మ, కామాక్షమ్మల దాతృత్వంతో నిర్మించిన సత్రాలు శిథిలావస్థకు చేరడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు వాటిని కూల్చివేసి నూతన కట్టడాలు కట్టడం మంచిదే కానీ,  దాతల కుటుంబసభ్యులకు తెలపకుండా తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ చర్యలను ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గూడూరును అభివృద్ధి చేసేవారికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీకంఠి రామ్మోహన్‌రావు, గోపికృష్ణ, దశరఽథరామిరెడ్డి, రియాజ్‌అహ్మద్‌, నాశిన భాస్కర్‌గౌడ్‌, దేవానంద్‌, వాయుగండ్ల సుధాకర్‌, ఆరికట్ల బాలకృష్ణమ నాయుడు, హనుమంతరావు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-25T04:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising