ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిన్నిస్‌ రికార్డుకు చేరువలో అమీర్‌జాన్‌ చిత్రం

ABN, First Publish Date - 2021-02-28T04:07:39+05:30

చిత్రకారుడు అమీర్‌జాన్‌ గీస్తున్న చిత్రం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుకు చేరువలో ఉంది.

చిత్రాన్ని వేస్తున్న అమీర్‌జాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(సాంస్కృతికం), ఫిబ్రవరి 27 : చిత్రకారుడు అమీర్‌జాన్‌ గీస్తున్న చిత్రం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుకు చేరువలో ఉంది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించాలన్న లక్ష్యంతో నగరానికి చెందిన చిత్రకారుడు అమీర్‌జాన్‌  100 గంటల్లో 790 చదరపు  అడుగుల చిత్రం గీసేందుకు ఆ సంస్థ నుంచి అనుమతులు పొందారు.  ఆరు రోజులుగా రోజుకు 8గంటలు పనిచేస్తూ మేకప్‌ రంగులతో చిత్రాన్ని గీస్తున్నారు. శనివారం సాయంత్రానికి 700 చదరపు అడుగుల చిత్రం గీశారు. సేవ్‌ ట్రీస్‌, పర్యావరణాన్ని కాపాడుదాం అనే అంశాన్ని ఈ చిత్రం  ద్వారా తెలిపేందుకు శ్రమిస్తున్నారు.  ఆ అతి భారీ చిత్రాన్ని పలువురు పాఠశాల విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. సాక్షులుగా చిత్రకారిణి కోమల ఆర్ట్స్‌ గ్యాలరీ అధినేత ఎన్‌.అన్నపూర్ణ, ఎన్‌.బాలు, హెచ్‌ఎం బాలభవన్‌ డైరెక్టరు జి.సుభద్రాదేవి వ్యవహరించారు. కార్యక్రమంలో దోర్నాల హరిబాబు, విశ్రాంత ఎంఈవో కె.ఎస్‌.నరసయ్య, భాస్కర్‌, హరనాఽథ్‌రెడ్డి, విశ్వం స్కూలు కరస్పాండెంట్‌ బాలకృష్ణ  పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-28T04:07:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising