ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలసత్వం వీడకుంటే.. ఇంటికే!

ABN, First Publish Date - 2021-12-05T04:38:55+05:30

ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగుల అలసత్వాన్ని సహించాం. ఇకనైనా మార్పు రాకపోతే ఇళ్లకు పంపుతామని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి హెచ్చరిం చారు.

దాదరాయిగుంటను పరిశీలిస్తున్న డీపీవో ధనలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లా పంచాయతీ  అధికారి హెచ్చరిక

కోట, డిసెంబరు 4 : ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగుల అలసత్వాన్ని సహించాం. ఇకనైనా మార్పు రాకపోతే ఇళ్లకు పంపుతామని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి హెచ్చరిం చారు. కోట, దాదరాయిగుంటల్లో శవాఆరం ఆమె మురుగు కాలువలను పరిశీలించారు. గ్రామాల్లో బ్లీచింగ్‌ చల్లినంతమాత్రాన రోగాలు రావనుకుంటే అది పోరపాటే అన్నారు. ప్రభుత్వం నుంచి నెలనెల జీతాలు తీసుకుంటున్నారు. ఆ డబ్బు చెట్లకు కాస్తోందా అని ప్రశ్నించారు. తప్పించుకుని తిరగాలని చూస్తే విధుల నుంచి తొలగిస్తామన్నారు. ప్రతి రోజు సచివాలయాలలో స్పందన కార్యక్ర మం నిర్వహించాలన్నారు. సచివాలయాల ఆవశ్యకతను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఓటీఎస్‌ తది తర పథకాల లక్ష్య సాధనపై  నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారు ణమన్నారు.  చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాల పనితీరు దారుణంగా ఉందన్నారు.  అనంతరం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో  కోఆర్డినేటర్‌ శ్రీనివాసులురెడ్డి, డీఎల్‌పీవో వెంకట రమణ, ఎంపీడీవో భవాని, ఈవోపీఆర్‌డీ స్వరూపారాణిలు వివిధ అంశాలను సమీక్షించారు.

Updated Date - 2021-12-05T04:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising