ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమతులు వచ్చాక ఆనందయ్య మందు పంపిణీ : కాకాణి

ABN, First Publish Date - 2021-05-22T04:46:39+05:30

కొవిడ్‌ నివారణకు ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు సత్ఫలితాలను ఇస్తోందని, ఐసీఎంఆర్‌ నివేదిక, ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత ఆ మందు పంపిణీని పకడ్బందీగా చేపడతామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1 రాయుడు 21 - విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాకాణి 

నెల్లూరు(జడ్పీ), మే 21 : కొవిడ్‌ నివారణకు ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు సత్ఫలితాలను ఇస్తోందని, ఐసీఎంఆర్‌ నివేదిక, ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత ఆ మందు పంపిణీని పకడ్బందీగా చేపడతామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనందయ్య కుటుంబం ఇచ్చే మందు వాడిన వారంతా వ్యాధి నయం అవుతోందని చెబుతుండడంతో పెద్దఎత్తున జనం వస్తున్నారని చెప్పారు. దీంతో లోకాయుక్త ఆదేశాల మేరకు ఆ మందులో శాస్త్రీయత నిర్థారణ కోసం ఆయుష్‌ సంస్థ పరీక్షలు జరిపిందని వాటి ఫలితాలు రావాల్సి ఉందన్నారు. అలాగే ఆ మందు పరిశీలనకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఐసీఎంఆర్‌ బృందాన్ని పంపారని, ఆ నివేదిక కూడా రాగానే మందు పంపిణీని ప్రారంభిస్తామని కాకాణి తెలిపారు. అప్పటి వరకు మందు కోసం ఎవరూ రావద్దని, ఈలోపు ఆనందయ్య ముడిసరుకును సమకూర్చుకోవాల్సి ఉందని చెప్పారు. మందు పంపిణీ పునఃపారంభం తర్వాత ఆన్‌లైన్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆనందయ్య మాట్లాడుతూ పసురు కంట్లో వేసుకుంటే కంటి చూపు పోతుందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, తామిచ్చే పసురు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే మందు పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు.

Updated Date - 2021-05-22T04:46:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising