ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా కౌంటింగ్‌ నిర్వహణకు చర్యలు

ABN, First Publish Date - 2021-09-19T04:17:12+05:30

ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌కు చర్యలు తీసుకున్నట్లు ఆర్డీవో మురళీకృష్ణ తెలిపారు. స్థానిక ఎస్వీఆర్ట్స్‌ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లను శనివారం జేసీ గణేష్‌కుమార్‌తో కలసి ఆయన పరిశీలించారు.

గూడూరు: ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఆర్డీవో మురళీకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రశాంతంగా కౌంటింగ్‌ నిర్వహణకు చర్యలు

గూడూరు, సెప్టెంబరు 18: ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌కు చర్యలు తీసుకున్నట్లు ఆర్డీవో మురళీకృష్ణ తెలిపారు. స్థానిక ఎస్వీఆర్ట్స్‌ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లను  శనివారం జేసీ గణేష్‌కుమార్‌తో కలసి ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

పటిష్ట బందోబస్తు 

కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం  ఎస్వీఆర్ట్స్‌ కళాశాలలో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తనతోపాటు ముగ్గు రు సీఐలు, ఎనిమిది మంది ఎస్‌ఐలు, 150మంది సిబ్బంది తో బందోబస్తును పర్యవేక్షిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐలు నాగేశ్వ రమ్మ, శ్రీనివాసులురెడ్డి, హరికృష్ణ, ఎస్‌ఐలు పవన్‌కుమార్‌, రోజా లత, తిరుపతయ్య, బ్రహ్మనాయుడు, పుల్లారావు పాల్గొన్నారు. 

  వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికే అనుమతి

నాయుడుపేట / టౌన్‌ :  వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, లేని వారికి ర్యాపిడ్‌ టెస్టు చేయించి, కొవిడ్‌ నెగెటివ్‌ ఉంటేనే అనుమ తిస్తామని ఆర్డీవో సరోజిని తెలిపారు. నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని డీఎస్పీ శ్రీని వాసరావుతో కలసి పరిశీలించారు.  సీఐ సోమయ్య పాల్గొన్నారు. 

వెంకటగిరి: పట్టణంలోని విశ్వోదయ ప్రభుత్వ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రాన్ని, స్ట్రాంగ్‌రూంను  ఎన్నికల ప్రత్యేక అధికారి సాంబశివారెడ్డి పరిశీలించారు.  ఆర్‌వో మణికుమార్‌, సీఐ నాగ మల్లేశ్వరరావు, ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బాలాయపలి:స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఆర్‌వో ప్రసాద్‌రావు కౌంటింగ్‌ ప్రక్రియపై పర్యవేక్షకులు, సహాయ కులకు శిక్షణ ఇచ్చారు. తహసీల్దారు నౌషద్‌ అహ్మద్‌, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, శిక్షకులు రమేష్‌బాబు, కమలాకర్‌  పాల్గొన్నారు.

కోట : కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆర్‌వో బందిల రమణయ్య కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దారు పద్మావతి,  ఎంపీడీవో భవాని, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఆమోష్‌బాబు, తదితరులు ఉన్నారు. 



Updated Date - 2021-09-19T04:17:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising