ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 9 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

ABN, First Publish Date - 2021-05-09T03:51:42+05:30

జిల్లాలోని 9 కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో మూడువేల బెడ్లను సిద్దం చేసినట్లు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు.

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్ద అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూర్తి స్థాయిలో వైద్య సేవలు 

కలెక్టర్‌ చక్రధర్‌బాబు 

నాయుడుపేట, మే 8 : జిల్లాలోని 9 కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో మూడువేల బెడ్లను సిద్దం చేసినట్లు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు. నాయుడుపేట - బిరదవాడ జాతీయ రహదారి సమీపంలో టిడ్కో గృహాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను శనివారం కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో ఉన్న కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో వెయ్యి మందికి పైగా చికిత్స పొందుతున్నారన్నారు. ప్రతి సెంటర్‌లో వైద్య సేవలతో పాటు పరీక్షలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. నాయుడుపేట  సెంటర్‌లో  72 వైద్యసేవలు వినియోగించుకుంటున్నారన్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. కలెక్టర్‌ వెంట నాయుడుపేట ఆర్డీవో సరోజిని, ప్రోగ్రామింగ్‌ అధికారి దయాకర్‌, డ్రాయింగ్‌ అధికారి హరిప్రియ, నాయుడుపేట సీఐ వేణుగోపాల్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2021-05-09T03:51:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising