ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో నష్టపోయిన పిల్లలకు ప్రతి నెలా రూ.500

ABN, First Publish Date - 2021-06-19T04:58:33+05:30

కొవిడ్‌-19 తల్లినిగానీ తండ్రినిగానీ కోల్పోయిన 18 ఏళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, స్పాన్సర్‌షిప్‌ ద్వారా ఆయా పిల్లల బ్యాంకు ఖాతాలలో ప్రతి నెలా రూ.500 జమ చేస్తుందని ఐసీడీఎస్‌ పీడీ కేఎం రోజ్‌మండ్‌ తెలిపారు. అలాంటి వివరాలను తక్షణమే సేకరించాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న పీడీ కేఎం రోజ్‌మండ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీడీఎస్‌ పీడీ రోజ్‌మండ్‌

నెల్లూరు (వీఆర్సీ), జూన్‌ 18 : కొవిడ్‌-19 తల్లినిగానీ తండ్రినిగానీ కోల్పోయిన 18 ఏళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, స్పాన్సర్‌షిప్‌ ద్వారా ఆయా పిల్లల బ్యాంకు ఖాతాలలో ప్రతి నెలా రూ.500 జమ చేస్తుందని ఐసీడీఎస్‌ పీడీ కేఎం రోజ్‌మండ్‌ తెలిపారు. అలాంటి వివరాలను తక్షణమే సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఆమె కార్యాలయంలో శుక్రవారం స్పాన్సర్‌షిప్‌, పోస్టర్‌కేర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇద్దరూ కొవిడ్‌- 19తో మరణిస్తే వారి పిల్లలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున అందిస్తుందని తెలిపారు. అలాగే తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు మరణిస్తే వారికి నెలకు రూ.500 అందిస్తుందన్నారు. ఇలాంటి వారిని జిల్లాలో ఇప్పటికే 135 మందిని గుర్తించామని తెలిపారు. వారి సంరక్షణను ఐసీడీఎస్‌ చేపడుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీడీ ఉమాదేవి, డీసీపీవో సురేష్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ రాజేష్‌, డాక్టర్‌ కవిత, ఎన్జీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T04:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising