ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో నలుగురి అరెస్టు

ABN, First Publish Date - 2021-05-11T03:57:14+05:30

రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే నాగముంతల అనిల్‌ను పథకం ప్రకారం హత్యచేశారని గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ నరసింహరావులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, మే 10 : రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే నాగముంతల అనిల్‌ను పథకం ప్రకారం హత్యచేశారని గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కోట పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం రాఘవాపురం ఘర్షణ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 6న గ్రామంలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందగా, అంత్యక్రియలకు వెళ్లిన అనిల్‌, ప్రతాప్‌ అదే గ్రామానికి చెందిన అంకయ్య పొలంలోని బావిలో స్నానాలు చేశారు. ఈ విషయంపై వారు ఘర్షణ పడ్డారు. ఎంపీటీసీ ఎన్నికల్లో అనిల్‌ తమకు వ్యతిరేకంగా పనిచేశాడన్న అభిప్రాయంతో అప్పటికే కక్ష పెంచుకున్న నిందితులు ఈ ఘర్షణ సాకుతో ఈ నెల 7న నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న అనిల్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. దాడిని అడ్డుకునేందుకు యత్నించిన జగ్గయ్య, రహీముల్లా, కల్యాణ్‌పై కూడా దాడి చేసి గాయపరిచారు.  వాకాడు సీఐ నరసింహరావు సోమవారం నిందితుల్లో నలుగురిని అరెస్టు చేశారు. ఒక వ్యక్తి నెల్లూరులో చికిత్స పొందుతుండగా, మరొకరు కరోనాతో బాధపడుతున్నాడని డీఎస్పీ వివరించారు. ఎస్‌ఐ మహేంద్ర, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-11T03:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising