ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

38 ఆసుపత్రుల్లో 2751 పడకలు

ABN, First Publish Date - 2021-05-12T05:32:10+05:30

జిల్లాలోని 38 కొవిడ్‌ ఆసుపత్రుల్లో 2751 పడకలు ఉన్నా యని కలెక్టర్‌ చక్రధర్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(వైద్యం) , మే 11 : జిల్లాలోని 38 కొవిడ్‌ ఆసుపత్రుల్లో 2751 పడకలు ఉన్నా యని కలెక్టర్‌ చక్రధర్‌బాబు మంగళవారం  ఒక ప్రకటనలో తెలిపారు. వాటిలో ఆక్సిజన్‌ పడకలు 1343కుగాను శనివారానికి 1302, 111 ఐసీయూ పడకలకుగాను 102 నిండి ఉన్నాయని తెలిపారు. వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న 221 పడకలు పూర్తిగానూ, సాధారణ పడకలు 1076కుగాను451 నిండి ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్న  3240 పడకల్లో  982 మాత్రమే నిండి ఉన్నాయని పేర్కొన్నారు. హోం ఐసోలేషన్‌లోని 1341 మందికి మందుల కిట్లు అందించామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు హోం క్వారంటైన్‌లో ఉన్న 46,835 మందిని వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు సందర్శించి కొవిడ్‌ నివారణకు సలహాలు సూచనలు ఇచ్చారని తెలిపారు. జిల్లా లోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో 1615 మంది వైద్యులు, స్పెషలిస్ట్‌లు, పారామెడికల్‌ సిబ్బంది, నాల్గో తరగతి సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. శనివారానికి 550 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌లు అందుబాటులో ఉండగా అందులో 474 డోసులు వినియోగించారని తెలిపారు. అందుబాటులో ఉన్న 40 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను వినియోగించారని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-12T05:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising