ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూరుశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-05-12T05:29:36+05:30

జిల్లా పోలీస్‌శాఖ నూరుశాతం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ సిఎం త్రివిక్రమ్‌వర్మ ఆదేశించారు.

వీడియో కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతున్న డిఐజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఐజీ డాక్టర్‌ సి.ఎం. త్రివిక్రమ్‌వర్మ

నెల్లూరు(క్రైం), మే 11: జిల్లా పోలీస్‌శాఖ నూరుశాతం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ సిఎం త్రివిక్రమ్‌వర్మ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం డీఐజీ వ్యాక్సిన్‌ వేయించుకొన్న అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అపోహలను తొలగించుకొని వ్యాక్సిన్‌ వేసుకునేలా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ మాట్లాడుతూ జిల్లాలో పోలీసుశాఖలో ఇప్పటికే 97 శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేశామని  తెలిపారు. వ్యాక్సినేషన్‌లో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే మెదటి స్థానంలో ఉండటం సంతోషంగా ఉందని డీఐజీ అన్నారు.  కరోనా సోకిన వారు సకాలంలో వైద్యం చేయించుకోవడంతో పాటు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ పి. వెంకటరత్నం, ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ కె శ్రీలక్ష్మీ, ఎఆర్‌ ఏఎస్పీ వీరభద్రుడు, డీఎస్పీ హోంగార్డ్సు శ్రీనివాసరావు, ఆర్‌ఐలు శ్రీనివాసులరెడ్డి, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-12T05:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising