ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 వేల కోట్ల పనిదినాలు కల్పించాం

ABN, First Publish Date - 2021-10-30T03:35:22+05:30

రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం కింద 10 వేల కోట్ల పని దినాలతో 40 లక్షల కుటుంబాలకు జీవనోపాది కల్పిస్తున్నామని పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్‌ శివశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

మాట్లాడుతున్న డిప్యూటీ కమిషనర్‌ శివశంకర్‌ ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్‌ శివశంకర్‌ ప్రసాద్‌

కోట, అక్టోబరు 29 : రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం కింద 10 వేల కోట్ల పని దినాలతో 40 లక్షల కుటుంబాలకు జీవనోపాది కల్పిస్తున్నామని పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్‌ శివశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. కోట మండల పరిషత్‌ కార్యాలయంలో కొనసాగుతున్న వార్డు మెంబర్ల శిక్షణ తరగతులను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 25 కోట్ల పనిదినాలు కల్పించడం లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 22 కోట్ల పనిదినాలు కల్పించామన్నారు. ప్రతి 15 రోజులకోసారి బీబీటీ విధానం ద్వారా కూలీల బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. జగనన్న పచ్చతోరణం కింద 13 జిల్లాల్లో రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాగా, అందులో 80 శాతం మొక్కలు బతికాయన్నారు. ఉపాధిహామి పథకంలో 200 రకాల పనులు ఉన్నాయని వాటిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.  941 పంచాయతీల్లో 8,842 మంది వార్డు సభ్యులకు ఈ శిక్షణలు ఇస్తున్నామన్నారు. 40 మండలాల్లో శిక్షణ పూర్తిచేశామని మరో 6 మండలాల్లో పూర్తి కావాల్సి ఉందన్నారు. ఆయన వెంట శిక్షణ తరగతుల మేనేజర్‌ ఏవై శివ, ఇన్‌చార్జి ఎంపీడీవో స్వరూపారాణి తదితరులు ఉన్నారు. 


 

Updated Date - 2021-10-30T03:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising