ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి

ABN, First Publish Date - 2021-11-30T02:42:12+05:30

నెల్లూరు జిల్లాలో ఆది,సోమవారాల్లో కురిసిన కుంభవృష్టికి జనజీవనం స్తంభించిపోయింది. గడచిన 48 గంటల్లో ఎడతెరపి లేకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆది,సోమవారాల్లో కురిసిన కుంభవృష్టికి జనజీవనం స్తంభించిపోయింది. గడచిన 48 గంటల్లో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కలుజులు పారుతున్నాయి. ఒకటి రెండు చెరువులకు గండ్లు పడగా, తెగిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఒకటి రెండు చెరువులకు అధికారులే గండ్లు కొట్టారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా పలు గ్రామీణ రూట్లకు సంబంధించిన 200 ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.  ఆదివారం ఒక్కరోజే ఆర్టీసీకి రూ.30 లక్షలు నష్టం వాటిల్లింది. చెన్నై జాతీయ రహదారిపై గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద వరద ప్రవహించడంతో  వాహనాలు కిలోమీటర్ల దూరం ఆగిపోయాయి.  మూడు కిలోమీటర్ల దూరం ట్రాఫిక్‌ కొనసాగుతోంది. ఎస్పీ సీహెచ్‌. విజయరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేసి పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ఆదిశంకర కాలేజీ వద్ద రోడ్డు దాటడం కోసం హైవేపై గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలో 107.9 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. 

Updated Date - 2021-11-30T02:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising