ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధిక్కరణ వ్యాజ్యం తయారీలో అశ్రద్ధ

ABN, First Publish Date - 2021-06-20T09:05:27+05:30

కేసుతో సంబంధం లేనప్పటికీ, అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంబంధం లేని ఐఏఎస్‌ అధికారి కోర్టుకు

పోలా భాస్కర్‌కు అసౌకర్యం కలిగించారు

పిటిషనర్‌, న్యాయవాదిపై హైకోర్టు అసహనం

ఆయనకు ఖర్చుల కింద 10 వేలు చెల్లించండి

ఆదేశించిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌


అమరావతి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): కేసుతో సంబంధం లేనప్పటికీ, అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఐఏఎస్‌ అధికారి విలువైన సమయాన్ని వృథా చేసినందుకుగాను రెండు వారాల్లో ఆయనకు రూ.10 వేలు చెల్లించాలని పిటిషనర్‌ పువ్వాడ శ్వేతను ఆదేశించింది. ఈ మేరకు హైకో ర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవ ల తీర్పు చెప్పారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తన చౌక ధరల దుకాణానికి సరుకులు కే టాయించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ  శ్వేత హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ వ్యా జ్యాన్ని వి చారించిన హైకోర్టు దుకాణానికి సరుకులు కేటాయించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇ చ్చింది. ఆ ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యా జ్యాన్ని విచారించిన  న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిం ది. ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించింది. దీంతో అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్‌, ప్రస్తుత ఉన్నత విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ కోర్టుకు హాజరయ్యారు. 23 జూన్‌ 2020న కోర్టు ఇచ్చి న ఆదేశాలను అమలు చేశామని వివరించారు. 


ఆ వివరణతో సంతృప్తి చెం దిన న్యాయమూర్తి కోర్టు ఆదేశాలు అ మలు చేయడంలో స్వల్ప జాప్యం జరిగిందని అభిప్రాయపడ్డారు. అందుకు ప్రతివాదులు తగిన కారణాలు చూపెట్టారని పే ర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ ప్రక్రియ కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం పరిశీలిస్తే... న్యాయస్థానం ఉత్తర్వుల అమలుకు సంబంధం లేని జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను వ్యాజ్యంలో రెండో ప్రతివాదిగా చేర్చారని న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. సివిల్‌ సప్లైస్‌ ఇన్‌చార్జిగా ఉన్న జాయిం ట్‌ కలెక్టర్‌ స్థానంలో కలెక్టర్‌ను ప్రతివాదిగా చేర్చడం ద్వారా పిటిషనర్‌ ఘోరమైన తప్పుకి చేశారని, తద్వారా ఐఏఎస్‌ అధికారికి అసౌకర్యం కలిగించారని అభిప్రాయపడ్డారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం తయారు చేసే సమయంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రద్ధ తీసుకోలేదని చెప్పడానికి సంకోచించడం లేదని పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-20T09:05:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising