ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడపిల్లల పెళ్లి వయస్సు పెంచడంపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-12-26T17:34:21+05:30

ఆడపిల్లలను వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోనికుండా కార్పొరేట్ కంపెనీలకు లేబర్ అందించాలనే ఉద్దేశ్యంతోనే కేంద్రం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఆడపిల్లలను వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోనివకుండా కార్పొరేట్ కంపెనీలకు లేబర్‌ని అందించాలనే ఉద్దేశ్యంతోనే కేంద్రం అమ్మాయిల పెళ్లి వయస్సు పెంచిందని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సీపీఐ 97వ అవతరణ దినోత్సవంలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిల వివాహ వయస్సు 21 సంవత్సరాలు పెంచడం కంటే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తేవాలని డిమాండ్ చేశారు. మద్యం ధర తగ్గించి పెట్రోల్ ధర పెంచటం తగదని నారాయణ అన్నారు.


సీఎం జగన్మోహన్‌రెడ్డి శాడిస్ట్ ఆలోచన వల్లే సినిమా టికెట్ ధర తగ్గించి, థియేటర్స్ మూయిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన సూచనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో హద్దు మీరి ప్రవర్తిస్తోందని.. ఆ పార్టీ నేత గుప్తాపై దాడి ఒక ఉదాహరణ మాత్రమేనని చెప్పారు.తల్లిపాలు లాంటి అమరావతి ఉద్యమానికి పోటీగా పోత పాలలాంటి రాయలసీమ, కోస్తా ఉద్యమాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని నారాయణ జోస్యం చెప్పారు. 

Updated Date - 2021-12-26T17:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising