ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్లే సంక్షోభంలో చేనేత రంగం: నారా లోకేష్‌

ABN, First Publish Date - 2021-12-27T21:00:12+05:30

సీఎం జగన్‌రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సోమవారం లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సోమవారం లేఖ రాశారు. చేనేత రంగానికి మరణశాసనంగా మారిన జీఎస్టీ పెంపు అంశంపై..కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్లే చేనేత రంగం సంక్షోభంలో పడిందన్నారు.చేనేత సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం నీరుగార్చిందని చెప్పారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడమే పెనుభారమైతే.ఇప్పుడు ఏకంగా దానిని 12 శాతానికి పెంచడం దారుణమన్నారు.జీఎస్టీ పెంపు నిర్ణయంతో చేనేత పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుని తమిళనాడు, తెలంగాణ వ్యతిరేకిస్తున్నా..ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే చేనేత రంగంపై.. జీఎస్టీ భారం 5 శాతాన్ని మించకుండా సబ్సిడీలు కల్పించాలని కోరారు. చేనేత రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లోకేష్‌ లేఖలో తెలిపారు. 

Updated Date - 2021-12-27T21:00:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising