ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్స్ డే శుభాకాంక్షలు: నారా లోకేష్

ABN, First Publish Date - 2021-09-05T17:13:02+05:30

జీవితంలో ఎదగడానికే కాదు, మన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో కూడా ఉపాధ్యాయుల ప్రభావం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జీవితంలో ఎదగడానికే కాదు, మన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో కూడా ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఉంటుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన దివంగత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుంటూ, గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.


కరోనా కారణంగా ఏపీలో చాలా మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయారని లోకేష్ అన్నారు. కొందరు కూలీ పనులకు కూడా వెళ్తున్నారని, ప్రభుత్వం వారికి ఏ సాయమూ చేయలేదని విమర్శించారు. ఇంకోవైపు చూస్తే మొదటి ఏడాదే మెగా డీఎస్సీ అన్న సీఎం జగన్ ఇంతవరకు ఆ మాటే ఎత్తడం లేదని ఆరోపించారు. ఉపాధ్యాయులను గౌరవించి, పూజించే సంస్కారం ఈ ప్రభుత్వానికి ఎలాగూ లేదని, కనీసం వారికి ఆకలి బాధలు లేకుండా చేస్తే అదే పదివేలన్నారు. కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు పరిహారం ఏమిస్తారో కనీసం ఈ రోజైనా ప్రకటించాలని లోకేష్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-09-05T17:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising