ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడిలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలం : నక్కా

ABN, First Publish Date - 2021-05-08T16:48:32+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తన కార్యాలయంలో శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తన కార్యాలయంలో శనివారం నాడు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నక్కా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడి విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల ప్రాణాలంటే సీఎం జగన్‌కు లెక్కలేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు కనీసం టెస్టులు కూడా సరిగ్గా చేయలేని దుస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. 


కరోనా పాజిటివ్ వచ్చినవారికీ బెడ్లు లేవని, మరోవైపు ఆక్సిజన్ కూడా అందడం లేదంటూ సీఎంపై విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ తరలిపోతుంటే రాష్ట్రంలో పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ప్రజలకు వ్యాక్సిన్ వేద్దామనే ఆలోచన ప్రభుత్వానికి లేనే లేదని.. కళ్లు ఉండి చూడలేని కబోదిలాగా జగన్ ప్రభుత్వం ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయని, తక్షణమే రాష్ట్రంలో ప్రజలందరికి వ్యాక్సిన్ వేయాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-05-08T16:48:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising