ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నువ్వా.. మేమా.. నగరిలో MLA Roja.. పుత్తూరులో ప్రత్యర్థివర్గం వ్యూహరచన..!?

ABN, First Publish Date - 2021-12-20T12:53:21+05:30

నువ్వా.. మేమా.. నగరిలో MLA Roja.. పుత్తూరులో ప్రత్యర్థివర్గం వ్యూహరచన..!?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జగన్‌ జన్మదిన వేడుకలకు పోటాపోటీ ఏర్పాట్లు


చిత్తూరు జిల్లా/పుత్తూరు : నగరి నియోజకవర్గంలో  సీఎం జగన్‌ జన్మదిన వేడుకలకు జరుగుతున్న ఏర్పాట్లు చర్చనీయాంశమవుతూనే వున్నాయి.వైసీపీలోనే ఎమ్మెల్యే ప్రత్యర్థి వర్గాలు ఇటీవల నగరిలో సమావేశమై రోజా పేరు చెప్పకనే విమర్శల దాడికి దిగిన సంగతి తెలిసిందే.తర్వాత రోజా మీడియా సమావేశంలో వారిపై ప్రతివిమర్శలకు దిగారు.ఈ నేపధ్యంలో ఆదివారం పుత్తూరులోని ఏలుమలై ఇంట్లో  సమావేశమైన ఎమ్మెల్యే రోజా  ప్రత్యర్ధి వర్గాలు మంగళవారం నిర్వహించ తలపెట్టిన జగన్‌ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లపై చర్చించారు. 


పుత్తూరులో దాదాపు పది వేలమంది కార్యకర్తలతో ర్యాలీ, కార్వేటినగరం కూడలిలో బహిరంగ సభ నిర్వహించాలని,నాలుగు ప్రదేశాలలో అన్నదానం చేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో ఏలుమలై, కేజే కుమార్‌, లక్ష్మీపతిరాజు, భాస్కరరెడ్డి, మురళిరెడ్డి, రవిశేఖరరాజు, నారాయణబాబు పాల్గొన్నారు. మరో పక్క ఎమ్మెల్యే వర్గం కూడా జగన్‌ పుట్టిన రోజు వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయిదు మండలాల్లో తన వర్గం తరపున గెలిచిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లను జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో భాగస్వాములను చేసి సత్తా చాటాలని వ్యూహరచన చేస్తున్నారు. నగరిలో పెద్దఎత్తున ర్యాలీ, బహిరంగ సభ, అన్నదానాలు చేయాలని భావిస్తున్నారు.అధికార పార్టీ కార్యకర్తలు ఒకేసారి జరిగే రెండు కార్యక్రమాల్లో ఎటువైపు మొగ్గాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - 2021-12-20T12:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising