ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోరు అదుపులో పెట్టుకో.. ‘ఉక్కు బంద్’‌లో వ్యక్తికి విజయసాయి వార్నింగ్

ABN, First Publish Date - 2021-03-05T16:43:32+05:30

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ మినహా కార్మిక సంఘాలు, పార్టీలు, ప్రజలు దీనిలో బంద్‌లో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో బంద్‌లో పాల్గొన్న వైపీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి చుక్కెదురు అయ్యింది. మానవహారాన్ని నిర్మించుకుంటూ... ప్రజలతో మాట్లాడుతూ వెళుతున్న ఆయనకు ఓ కార్మికసంఘానికి చెందిన నాయకుడి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.  


పోస్కోతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు ఒప్పందం చేసుకున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయిలో రహస్యంగా చేసుకున్న ఒప్పందం అంటూ ఆ వ్యక్తి మరోసారి జవాబిచ్చాడు. అధికారులకు కూడా తెలియకుండా జరిగిపోయిందని విమర్శించాడు. ఆ మాటకు విజయసాయి మండిపడ్డారు. ‘‘కరెక్టుగా మాట్లాడు.. నోరు అదుపులో పెట్టుకో..  నీకు లేని అధికారాన్ని ప్రదర్శించలేవు’’ అంటూ విసవిసా నడిచిపోయారు. 

Updated Date - 2021-03-05T16:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising