ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ Raghu rama లేఖ

ABN, First Publish Date - 2021-10-30T19:17:30+05:30

సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ రాఘురామ కృష్ణంరాజు లేఖరాశారు. జగన్మోహన్‌రెడ్డి తరపు న్యాయవాది పి.సుభాష్‌ను సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడంపై లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ రాఘురామ కృష్ణంరాజు లేఖరాశారు. జగన్మోహన్‌రెడ్డి తరపు  న్యాయవాది పి.సుభాష్‌ను సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడంపై లేఖ రాశారు. న్యాయవాది పి.సుభాష్... జగన్ అక్రమాస్తుల కేసులను వాదించారని తెలిపారు.  వైస్ వివేకానందరెడ్డి హత్య, ప్రముఖ డాక్టర్ సుధాకర్ అనుమానాస్పద మృతి సహా, వైసీపీ నేతలు న్యాయమూర్తులను దూషించడంపై కూడా సీబీఐ విచారణ జరుపుతోందన్నారు. ఇలాంటి విచారణ నేపథ్యంలో సీబీఐ తరపున పి.సుభాష్‌ను స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించడం సీబీఐపై విశ్వాసాన్ని సన్నగిల్లెలా చేస్తోందన్నారు. న్యాయమూర్తులపై దూషణల కేసును నేరుగా పర్యవేక్షణ చేయమని హైకోర్టు సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తరపున పని చేసిన న్యాయవాదిని సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ నియమించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. నిష్పక్షపాక్షత, పారదర్శకత దర్యాప్తు కోసం సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా పి.సుభాష్‌ని తొలగించాలని డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-30T19:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising