ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా: ఎంపీ సుభాష్‌

ABN, First Publish Date - 2021-11-24T23:43:32+05:30

రాష్ట్రంలో శాసన మండలి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో శాసన మండలి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. మండలి రద్దుపై తీసుకున్న తాజా నిర్ణయాన్ని వివాదాస్పదం చేయవద్దన్నారు. అది ప్రభుత్వ విధానమన్నారు. మండలిలో మూడు రాజధానుల బిల్లులో అప్పటి చైర్మన్ నిబంధనల ప్రకారం నడుచుకోలేదని ఆయన పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లును నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపలేదన్నారు. 




రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గతంలో శాసన మండలి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మండలిలో టీడీపీకి భారీ మెజారిటీ ఉండేది. అంతేకాకుండా టీడీపీకి చెందిన వ్యక్తే మండలి చైర్మన్‌గా ఉన్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సెలెక్ట్ కమిటీకి చైర్మన్ పంపలేదు. దీంతో మండలిని రద్దు చేయాలని కోరుతూ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం మండలిలో వైసీపీకి భారీ మెజారిటీ ఉండడంతో తిరిగి మండలిని రద్దు చేయరాదని అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది.  



Updated Date - 2021-11-24T23:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising