ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమువీర్రాజువి రాజకీయ డ్రామాలు: మంత్రి వెల్లంపల్లి

ABN, First Publish Date - 2021-09-06T20:15:36+05:30

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీఎం జగన్‌ను కలిశారు. గణేష్‌ ఉత్సవాలపై బీజేపీ నేతల ఆందోళన అంశంపై చర్చించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో వినాయకచవితి జరుపుకోవాలని భావిస్తున్న భక్తులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీఎం జగన్‌ను కలిశారు. గణేష్‌ ఉత్సవాలపై బీజేపీ నేతల ఆందోళన అంశంపై చర్చించినట్లు సమాచారం. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో సోము వీర్రాజువి రాజకీయ డ్రామాలని విమర్శించారు. ఏపీలో వినాయకచవితి పండుగ చేసుకోకూడదని ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగలు చేసుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. బీజేపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ పాలనపై బీజేపీ నేతలు కావాలనే మతం ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారనే విషయం సోమువీర్రాజు తెలుసుకోవాలన్నారు. వినాయక చవితి పండుగ చేసుకోవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు వినాయక చవితి జరుపుకోవాలని మంత్రి వెల్లంపల్లి సూచించారు.



Updated Date - 2021-09-06T20:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising