ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎస్‌పై ఎవరిని బలవంతం చేయలేదు: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2021-12-21T23:31:45+05:30

ఓటీఎస్‌పై ఎవరిని బలవంతం చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బెజవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఓటీఎస్‌పై ఎవరిని బలవంతం చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బెజవాడలో పలు అభివృద్ధి  కార్యక్రమాల పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఎర్రకట్ట వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం  చేస్తుంటాయని చెప్పారు. వారు చేయరు చేసే వాళ్లు చేయనివ్వరన్నారు. జగనన్న శాశ్వత గృహపథకాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెస్తున్నారని మండిపడ్డారు. ఓటేసిన ప్రజలకు జవాబుదారీతనంగా‌ ఉంటామన్నారు. ఒక్క రూపాయి కట్టొద్దని చెప్పడానికి అచ్చెన్నాయడు ఎవరని ప్రశ్నించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని నిలదీశారు. ప్రజలకు మంచి జరగాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-21T23:31:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising