ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేకప్‌ వేసుకునేవాళ్లు మాకు చెప్పడమేంటి?

ABN, First Publish Date - 2021-03-08T10:06:14+05:30

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను 28 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఎందుకు అడ్డుకోలేకపోయిందని ప్రశ్నిస్తూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కు పరిరక్షణ ఎలాగో వైసీపీకి తెలుసు: బొత్స


విశాఖపట్నం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను 28 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఎందుకు అడ్డుకోలేకపోయిందని ప్రశ్నిస్తూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విడుదల చేసిన వీడియోపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. ‘స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడానికి ఏం చేయాలో మాకు తెలుసు. అసలు నీ స్టాండ్‌ ఏమిటి? నువ్వు దీనిపై ప్రధాని మోదీని ప్రశ్నించావా? మేకప్‌ వేసుకుని వచ్చి మాకు సుద్దులు చెప్పొద్దు. మేము మేక్‌పలు వేసుకునేవాళ్లం కాదు. ప్రజల నుంచి వచ్చిన నాయకులమనే విషయాన్ని గుర్తుంచుకో’ అని పరోక్షంగా పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై విసుర్లు విసిరారు. ‘విశాఖను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ.. విశాఖ అభివృద్ధి వైఎస్‌ హయాంలోనే జరిగింది.. దీనిపై తాను చర్చకు సిద్ధం. రాజకీయంగా ఎదగాల్సిన లోకేశ్‌ ఒక శుంఠ అని, ఆయన భాష సగటు మనిషి తలదించుకునేలా ఉంది’ అని ఎద్దేవా చేశారు.

Updated Date - 2021-03-08T10:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising