ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు ప్రాంతాలు విడిపోకూడదనే మూడు రాజధానులు: మంత్రి అవంతి

ABN, First Publish Date - 2021-06-24T00:44:21+05:30

రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు విడిపోకూడదనే మూడు రాజధానులను ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు విడిపోకూడదనే మూడు రాజధానులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. దేశంలో మెట్రో నగరాలు అభివృద్ధి చెందాలని మంత్రి అవంతి అన్నారు. మెట్రో స్థాయిలో విశాఖను అభివృద్ధి చేసేందుకు పాలనా రాజధానిని అక్కడకు తరలిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో 33 చోట్ల ప‌ర్యాట‌క ప్రాంతాల్లో బార్లకు అనుమతి ఇచ్చామని మంత్రి అవంతి తెలిపారు. 


విశాఖలోని రుషికొండ వద్ద ఉన్న హోటల్‌ను బ్లూ బేగా 164 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి పేర్కొన్నారు. మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలను నెలకొల్పుతామని ఆయన ప్రకటించారు. రేపటి నుంచి పర్యాటక ప్రాంతాలను తెరుస్తామన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే పీవీ సింధు, సాయిరాజ్‌, రజినికి 5 లక్షల నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. 

Updated Date - 2021-06-24T00:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising