ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యశ్రీ పరిధిలోకి విష జ్వరాలు

ABN, First Publish Date - 2021-09-08T01:03:21+05:30

రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి విష జ్వరాలను సీఎం జగన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి విష జ్వరాలను సీఎం జగన్ చేర్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. జిల్లాలో 462 డెంగ్యూ, 31 చికెన్ గున్యా, 708 మలేరియా కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగకుండా, ప్రజలు చికిత్స పరంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని నాని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో విషజ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నందున దగ్గర అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయిందన్నారు. ఎక్కువ కేసులు ఉన్నచోట స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విష జ్వరాలను గుర్తించడానికి రెగ్యులర్‌గా సర్వే జరుగుతుందన్నారు. టెస్ట్స్ ఎక్విప్ మెంట్, మందులు సిద్దంగా ఉంచాలని అధికారులకు చెప్పామన్నారు. మిగతా జిల్లాల కంటే విశాఖ జిల్లాలో విషజ్వరాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని మంత్రి ఆళ్ల నాని  పేర్కొన్నారు.  

Updated Date - 2021-09-08T01:03:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising